అసిఫాబాద్: సిర్పూర్ యూ మండలంలో 32 గంజాయి మొక్కలు పట్టివేత: ఎస్సై రామకృష్ణా
సిర్పూర్ యూ మండలం బాబ్జీపేట గ్రామంలో 32 గంజాయి మొక్కలను పట్టుకున్నట్లు సిర్పూర్ యూ ఎస్సై రామకృష్ణా తెలిపారు. శుక్రవారం సిర్పూర్ యూ మండలం బాబ్జీపేట గ్రామంలోని పత్తి పంటల్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి 32 గంజాయి మొక్కలు పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు.. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.