సెట్టూరు మండలం మంగంపల్లి గ్రామ సమీపంలో ఆదివారం టమాటా లోడుతో వెళుతున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. టమాట నేలపాలైంది. సెట్టూరు నుంచి అనంతపురం మార్కెట్కు టమాటా లోడ్ తో బొలెరో వాహనం వెళుతుండగా రోడ్డు అడ్డంగా కుక్క వచ్చింది. కుక్కను తప్పించబోయి బొలెరో వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లి గుంతలో బోల్తా పడింది. టమాటా అంతా రోడ్డుపై పడి వృధా అయ్యింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.