జిల్లా పోలీస్ PGRS కు 121 పిటీషన్లు జిల్లా ఎస్పీ జగదీష్
Anantapur Urban, Anantapur | Sep 15, 2025
జాప్యం లేకుండా చట్టపరిధిలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ జగదీష్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాలులో సోమవారo ఉదయం 11 గంటల సమయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ నిర్వహించారు. ప్రజల నుంచి 121 పిటిషన్లు స్వీకరించామని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు.ప్రజల సమస్యలను నేరుగా విని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించారు.కుటుంబ కలహాలు, అత్తారింటి వేదింపులు, రస్తా తగాదాలు, తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు.