కామారెడ్డి: పెద్ద బజారుకు చెందిన మామిండ్ల రవీంద్ర నిఖిల్ అదృశ్యం, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
కామారెడ్డి పెద్ద బజారుకు చెందిన మామిండ్ల రవీంద్ర నిఖిల్, తండ్రి పేరు నరసింహులు, వయసు 23 సంవత్సరాలు, వృత్తి: విద్యార్థి అను వ్యక్తి తేదీ 28-4-2025 నాడు ఉదయం 11 గంటలకు సమయంలో ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నాను అని చెప్పి, తిరిగి ఇంటికి రాకపోయేసరికి, అతని తల్లి అయిన మామిండ్ల నందిని అతని గురించి వెతికి మరియు ఫోన్ చేస్తే స్విచాఫ్ రావడంతో ఈరోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి మిస్సింగ్ దరఖాస్తు ఇవ్వగా, కేసు నమోదు చేయడం జరిగింది. ఇతని ఆచూకీ తెలిసిన ఎవరైనా కూడా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నందు తెలియపరచగలరనీ పట్టణ సీఐ తెలిపారు.