కరీంనగర్: కిషన్ నగర్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని గంగుల సురేష్(40)ఆత్మహత్య కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంబించిన త్రిటౌన్ పోలీసులు
కరీంనగర్ త్రిటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ లో గంగుల సురేష్(40) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు కరీంనగర్ త్రిటౌన్ సిఐ జాన్ రెడ్డి తెలిపారు. ఆర్థిక సమస్యలు బాధపడుతూ సోమవారం అర్ధరాత్రి 12గంటల తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తము ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.