పోలీస్ అమరవీరుల త్యాగాలను ఎవరూ మరిచిపోకూడదని యాడికి ఎస్ఐ వెంకటరమణ అన్నారు. యాడికి లోని చెన్నకేశవ స్వామి దేవాలయం వద్ద బుధవారం పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్లు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పోలీసులు తమ ప్రాణాలు పణంగా పెట్టైనా ప్రజలకు రక్షణ కల్పిస్తారన్నారు. ప్రజారక్షణలో అనేకమంది పోలీసులు చనిపోయారన్నారు. వారి త్యాగాలను మనం గుర్తుపెట్టుకోవాలన్నారు.