కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పితృ అమావాస్య: అయ్యవారు, జంగాలకు మొక్కులు పితృ అమావాస్య
కోరుట్ల నియోజకవర్గంలో పితృ అమావాస్య: అయ్యవారు, జంగాలకు భక్తుల మొక్కులు కోరుట్ల సమీపంలోని అయిలాపూర్ గ్రామం తో పాటు కోరుట్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పితృ అమావాస్య సందర్భంగా ఈరోజు అయ్యవారు, జంగాలకు భక్తులు బియ్యం, కూరగాయలతో మొక్కులు చెల్లించారు. పితృ తర్పణాలు, దానధర్మాలతో వారి ఇంటి ప్రాంగణం ఉదయం నుండి సందడిగా మారింది. అమావాస్య నాడు పితృదేవతల పూజలతో భక్తులు బియ్యం, డబ్బులు, కూరగాయలు సమర్పించి, కుటుంబ సభ్యుల పేర్లతో పితృ కర్మలు నిర్వహించారు.