దర్శి: దర్శి పట్టణంలో రక్తదానం చేసిన అయ్యప్ప స్వామి భక్తులు, 90 మందికి పైగా భక్తులు రక్తదానం చేసినట్లు నిర్వాహకులు వెల్లడి
ప్రకాశం జిల్లా దర్శిలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్య క్రమం దేవస్థాన కమిటీచే నిర్వహించబడింది. కార్యక్రమంలో సుమారు 90 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులైన మారం శివ కోటిరెడ్డి మాట్లాడుతూ.. మాల ధరించిన స్వాములు నియమ నిష్టలతో ఉన్న ఈ సమయము నందు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం ఆదర్శవంతమని అన్నారు.