అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని నేమతాబాదు శివారు జగనన్న కాలనీ సమీపంలో మున్సిపాలిటీ కంపోస్టు యార్డు ఏర్పాటు చేయరాదని కాలనీ వాసులు ఆందోళన చేశారు. గుత్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం కాలనీ వాసులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు షఫీ, రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న కాలనీ సమీపంలో కంపోస్టు యార్డు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలు అనారోగ్యాలకు గురి అవుతారని అన్నారు. దుర్వాసన వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతారన్నారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.