పరిగి: దిర్సంపల్లి పాఠశాలలో సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు షి టీం ఆధ్వర్యంలో అవగాహన
జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశాలకు దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు షి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి సబ్ డివిజన్ షీ టీం ఇన్చార్జి నర్సింలు, ప్రధానోపాధ్యాయులు రూప్ సింగ్, మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని, బాల్య వివాహాలను ప్రోత్సహించిన, బాలలను పనిలో పెట్టుకున్న పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకు