సంగారెడ్డి: సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఐలమ్మ 130వ జయంతి వేడుకలు
తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి కోసం అయిలమ్మ చేసిన పోరాటాన్ని మదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కొనియాడారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అయిలమ్మ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి శుక్రవారం నివాళులర్పించారు. అయిలమ్మ స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ కూడా పాల్గొన్నారు.