ములుగు: ములుగు జిల్లా అభివృద్ధికి మంత్రి సీతక్క కృషి : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్
Mulug, Mulugu | Sep 16, 2025 మంత్రి సీతక్కకు ములుగు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రవి చందర్ నేడు మంగళవారం రోజున సాయంత్రం 5 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలో కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల్లోనే ములుగు జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. ఏకో టూరిజానికి రూ. 37 కోట్లు, నర్సింగ్ కాలేజీకి రూ. 13 కోట్లు, ములుగు పట్టణాభివృద్ధికి రూ.50 కోట్లు, మేడారం జాతరకు రూ.150 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.