సంక్రాంతి వేడుకల్లో భాగంగా పూడూరు–కిష్టాపూర్ డివిజన్ KLR ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి శనివారం ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. పోటీలో పాల్గొన్న మహిళలను ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉత్సాహపరుస్తూ, స్వయంగా ముగ్గు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తనదైన శైలిలో సరదాగా మాట్లాడుతూ.. అక్కడున్న వారందరినీ నవ్వించారు. ఆయన పాల్గొనడంతో కార్యక్రమానికి మరింత ఉత్సాహం నెలకొంది.