తిరుపతి జిల్లా తడ మండలం శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న లారీ.. ముందు ఇనుప లోడ్‌తో వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఇనుప లోడుతో వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో లారీలో ఇరుక్కొని ఓ వ్యక్తి చనిపోయినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు.