ఊర్కొండ: వెల్దండలో పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య
వెల్దండలో పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తాడూరు మండల కేంద్రానికి చెందిన షేక్ సయ్యద్ బతుకుదెరువు కోసం రెండేళ్లుగా వెల్దండ మండల కేంద్రంలోని చికెన్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వెల్దండ ఎస్సై రవి తెలిపారు..