డి.హిరేహాల్ మండల కేంద్రంలో హిందూ సమ్మేళనాన్ని హిందూ సంస్కృతి సాంప్రదాయం ఉట్టి పడేలా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం శివలింగ మఠం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సోమసంద్ర మఠం సిద్దలింగ మహాస్వామి ఆర్ఎస్ఎస్ క్షేత్ర కార్యవాహ తిప్పేస్వామి, రిటైర్ ఆర్మీ ఆఫీసర్ ఎర్రిస్వామి కర్నాటక ధర్మ జాగరణ సమితి రూపశ్రీ హాజరై మార్గ దర్శనం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించేందుకు హిందువులంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.