కూటమి ప్రభుత్వానికి నంద్యాల మెడికల్ కాలేజీ కనబడడం లేదా ;మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి
Nandyal Urban, Nandyal | Sep 15, 2025
సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్ అమరావతిని సృష్టించినట్లు జగన్ మెడికల్ కాలేజీలను నిర్మించ లేదని.. ఇందుకు నిలువెత్తు సాక్షమే నంద్యాల మెడికల్ కళాశాల అని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాగణంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా జగన్ కట్టలేదని చెబుతున్న టీడీపీకి నంద్యాల కాలేజీ కనబడటం లేదా? అని ఆయన ప్రశ్నించారు.