స్వర్ణాంధ్ర స్వచ్చ ఆంధ్ర లక్ష్య సాధన మనందరి లక్ష్యం: డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ
స్వర్ణాంధ్ర స్వచ్చఆంధ్ర లక్ష్య సాధన మనందరి లక్ష్యమని డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ అన్నారు. మూడవ శనివారం వాల్మీకిపురం మండలం చింతపర్తి పీ. హెచ్. సి. పరిధిలోని మూరేవాండ్ల పల్లి గ్రామం లో సెక్రెటరీ రమేష్ బాబు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్చాంద్ర మరియు 104 సేవలలో ప్రజలను భాగస్వామ్యం చేసి గాలి కాలుష్యం వల్ల మానవాలికి కలిగే అనారోగ్య పరిస్థితుల పై అవగాహనా సదస్సు చేపట్టారు. ఈ సందర్బంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ జీవనాధారమైన మన గాలి,వాహనాలు, పరిశ్రమల వల్ల నాణ్యత తగ్గుతోందని, నివారణ కొరకు మనందరం కలిసి పనిచేయాలన్నారు.