బేతంచర్ల ఎమ్మార్వో కార్యాలయంలో సేద్యపు పద్ధతిలో పండించిన కూరగాయలపై అవగాహన కార్యక్రమం
Dhone, Nandyal | Sep 15, 2025 నంద్యాల జిల్లా బేతంచెర్లలో సేద్య పద్ధతిలో పండించిన పాడిపంటలను ప్రోత్సహించాలని మాస్టర్ ట్రైనర్ రమాదేవి సూచించారు. స్థానిక ఎమ్మార్వో ఆఫీస్‌లో సోమవారం రైతులు గ్రామాల్లో పండించిన కూరగాయలపై అవగాహన కల్పించారు. సాధారణ ఎరువులు ఉపయోగించి పాడిపంటలు పండించాలని సూచించి, రైతులు తమ పంటల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. యూనిట్ ఇన్‌ఛార్జి మహేష్ బాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.