శ్రీకాకుళం: నగరంలో sbi స్టాఫ్ కాలనీలో మామిడి కిరణ్ కుమార్ ఇంట్లో భారీ చోరి,కేసు నమోదుచేసిన రూరల్ ఎస్ఐ రాము
శ్రీకాకుళంలోని sbi స్టాఫ్ కాలనీలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగిందని బాధితులు మామిడి కిరణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 7, 8 తేదీల్లో తిరుపతి దర్శనం వెళ్లి వచ్చి చూడగా ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించాడు. బాధితుడు వెంటనే రూరల్ ఎస్సై ఆదివారం ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలం చేరుకున్న రూరల్ పోలీసులు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని గుర్తించారు. ఘటనపై రూరల్ ఎస్సీ రాము కేసు ఆదివారం రాత్రి 8గంటల 30 నిమిషాలకు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.