అసిఫాబాద్: మొంథా తుపాన్లో నష్ట పోయిన రైతులను ఆదుకోవాలి: సీపీఎం
మొంథా తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా రైతులు పంట నష్టాన్ని చవిచూశారని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని CPM కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే గుర్తించి, ఎకరానికి రూ.15 వేలు పరిహారం అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.