ఆత్మకూరు పట్టణంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిరిభావ దినోత్సవం ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గౌడ్ సెంటర్‌లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.అనంతరం పాత బస్టాండ్ లో సభ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం స్థాపించబడిన పార్టీ అని, ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు.పార్టీ అభివృద్ధికి కృషి చేసిన సీనియర్ నాయకులను, కార్యకర్తలను ఆయన సన్మానించారు.