తాడిపత్రి: భోగ సముద్రంలో బెల్టు షాపుపై పోలీసులు దాడులు, 34 మద్యం బాటిళ్లు స్వాధీనం, విక్రయదారుడు అరెస్ట్
తాడిపత్రి మండలం భోగ సముద్రం గ్రామంలో బుధవారం తాడిపత్రి రూరల్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ ప్రాంతంలో మద్యం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న పాత్ర శ్రీరాములు అనే వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 34 మద్యం బాటిళ్ల ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై సీఐ శివగంగాధర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.