నందిగామ గ్రామంలో యానాదులకు స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలి: యానాది సంఘ ప్రతినిధులు
Machilipatnam South, Krishna | Sep 25, 2025
పెడన మండలం నందిగామ గ్రామంలో యానాదులకు స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని యానాది సంఘ ప్రతినిధులు గురువారం మచిలీపట్నంలో డిఆర్ఎ చంద్రశేఖర రావుకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల ఒక వ్యక్తి మృతి చెందగా, అంత్యక్రియలకు స్థలం లేక ఇబ్బందులు పడినట్లు ప్రతినిధులు తెలిపారు. అధికారులు స్పందించి స్థలం కేటాయించాలని వారు కోరారు.