మంత్రాలయం: శ్రీ రంగనాథుడిని తమ శిష్య బృందంతో కలిసి దర్శించుకున్న మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి
మంత్రాలయం: తమిళనాడులో వెలసిన శ్రీ రంగనాథుడిని మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ఆదివారం తమ శిష్య బృందంతో కలిసి దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు పీఠాధిపతికి రంగనాథుడి ఆలయ గౌరవ దర్శనం కల్పించారు. ముందుగా పీఠాధిపతిని పల్లకిలో ఉంచి ఊరేగింపుగా దేవాలయం వరకు తీసుకొచ్చారు. అనంతరం పీఠాధిపతి లోక రక్షణ కోసం రంగనాథుని ఆలయంలో పూజలు చేశారు. అర్చకులు పీఠాధిపతిని సన్మానించారు.