చిలకలూరిపేట పట్టణంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం 6 సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడిగాలులతో కూడిన ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ వర్షానికి వాతావరణం చల్లబట్టంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పంట పొలాలకు ఈ వర్షం చాలా ఉపయోగకరంగా ఉంటుందని నియోజకవర్గ రైతులు సంతోషం చేస్తున్నారు.