పాడేరులో విశ్వకర్మ జయంతి వేడుకలలో ఉద్రిక్తత
అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో విశ్వకర్మ జయంతి వేడుకలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విశ్వకర్మ సంఘాన్ని, కులాన్ని దుర్భాషలాడుతూ దాడికి దిగారంటూ బంగారం షాపు ఎదుట బైఠాయించి విశ్వకర్మ సంఘం ఆందోళన చేపట్టింది. విశ్వకర్మ జయంతి సందర్భంగా పట్టణంలో ఉన్న బంగారం దుకాణాలు మూసివేతకు నిర్ణయించుగా ఓ దుకాణం మాత్రం తెరచి ఉండడంతో అడిగినందుకు ఎదురుదాడికి దిగి దుర్భాషలాడారంటూ ఆందోళనకు దిగారు. దీంతో వర్తక సంఘం అక్కడ చేరుకుని సముదాయించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.