ఇబ్రహీంపట్నం: ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపిన మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి
ఏటీఎం కేంద్రాల వద్ద ప్రజలను దృష్టి మరలచి మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ లో నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి మాట్లాడుతూ నిందితుడి వద్ద 26 ఏటీఎం కార్డులు ఒక కారు 6.31 నగదును స్వాధీనం చేసుకున్నామని ఆమె అన్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఏటీఎం కేంద్రాల వద్ద ప్రజలు లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సునీత రెడ్డి సూచించారు.