నగరి: నగరి మున్సిపాలిటీ 9వ వార్డులోని నత్తం కండ్రిగ దళిత వాడలో డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి -సిపిఐ పార్టీ
నగరి మున్సిపాలిటీలో ఉన్న 9వ వార్డు నత్తం కండ్రిగ దళితవాడలో సమస్యలను పరిష్కరించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు భాష అధ్యక్షతన సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళితవాడలో డ్రైనేజీ కాలువలు ప్రధాన వీధిలో పూర్తిగా లేనందున మురుగు నీరు అంతా నిల్వ ఉండటం వలన దోమలు ఎక్కువై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కావున డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని లైట్లు వీధి దీపాలు పూర్తిగా వెలగడం లేదు అందువలన రాత్రి సమయంలో బయటికి రావాలన్నా పిల్లలు మహిళలు చీకటిలో భయపడుతున్నారు కావున వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.