స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యకరమైన జీవితం సాధ్యం,కలికిరి లో అవగాహన ర్యాలీ నిర్వహించిన అధికారులు
స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమని ఎంపీడీవో భానుమూర్తి రావు డిప్యూటీ ఎంపీడీవో మహమ్మద్ రియాజుద్దీన్ తెలిపారు.శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడవ శనివారం స్వచ్ఛమైన గాలి ఆరోగ్యకరమైన జీవితం కార్యక్రమం పైన అవగాహన ర్యాలీని కలికిరి పంచాయతీ ఆవరణము నుండి ఈఓ జి.అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో భానుమూర్తి రావు, డిప్యూటీ ఎంపీడీవో మహమ్మద్ రియాజుద్దీన్ పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి కొరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం మానవహారం నిర్వహించి పంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.