ఎలుగుల మెట్టపై గ్రానైట్ తవ్వకాల అనుమతుల ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని కోరిన రాజకీయ ప్రతిపక్షాల నాయకులు
పార్వతీపురం మండలం,నర్సిపురం పంచాయతీ, హెచ్.కారాడవలస రెవెన్యూ పరిధిలోని "ఎలుగుల మెట్ట" కొండ పై ఎటువంటి క్వారీ, గ్రానైట్ తవ్వకాలు అనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని వామపక్ష,రైతు కూలీ, గిరిజన సంక్షేమ సంఘాల నాయకులు, సమీప గ్రామాల యువకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ లో పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి కు వినతిపత్రం అందజేశారు. సమీప గ్రామాల ప్రజల బ్రతుకులు, భవిష్యత్తు నాశనం చేసే మైనింగ్ కు అనుమతులు ఇవ్వొద్దన్నారు.