నగరి: చెంచులక్ష్మి కాలనీ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి : పుత్తూరులో దళిత గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వై.నందయ్య
పుత్తూరు మున్సిపాల్టీ 2వ వార్డు చెంచులక్ష్మి గిరిజనుల సమావేశం సోమవారం జరిగింది. దళిత గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వై.నందయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినా గిరిజనుల సమస్యలు పరిష్కారం కాలేదని, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. గిరిజనులకు అటవీ హక్కు చట్టం ప్రకారం ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. చెంచులక్ష్మి గిరిజనులకు ఇళ్ల స్థలాలు, శ్మశానం సమస్యలు పరిష్కరించాలన్నారు.