భీమిలి: ఆర్థిక,విద్యారంగా సమస్యలపై యుటిఎఫ్ రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి యుటిఎఫ్ పిలుపు
విద్యారంగంలో నెలకొన్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని, బోధ నేతర పనులను పూర్తిగా రద్దుచేసి ఉపాధ్యాయుడిని పూర్తిగా బోధనకు మాత్రమే పరిమితం చేయాలని, అదేవిధంగా ఆర్థిక పరమైన సమస్యలైన 11వ పిఅర్సీ బకాయిలను చెల్లించాలని,పెండింగ్లో ఉన్న నాలుగు DA లను చెల్లించాలని 12వ పిఆర్సి కమిషన్ నియమించి 30% ఐ ఆర్ ప్రకటించాలని యుటిఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో 19వ తేదీ శుక్రవారం నాడు జరుగనున్న రణభేరి బైక్ జాత కార్యక్రమం లో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని ఈరోజు సాయంత్రం అనందపురం జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.