సిర్పూర్ టి: తుంగమడుగు గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా భారీగా గుడుంబా స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఈజ్ గం పోలీస్ స్టేషన్ పరిధిలోని తుంగమడుగు గ్రామంలో కాగజ్ నగర్ రూరల్ సిఐ కుమారస్వామి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రతి ఇంటిని తనిఖీ చేయగా 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోగా, 3000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశామని, 30 కిలోల బెల్లం ఒక కిలో అల్లం స్వాధీనం చేసుకున్నామని రూరల్ సిఐ కుమారస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ రూరల్ సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు,