హిమాయత్ నగర్: ఆర్టీసీ క్రాస్ రోడ్ లో స్కూటీని ఢీకొన్న ఫైర్ ఇంజన్, ఒకరు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలు
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్టిసి క్రాస్ రోడ్ లో బండ్లగూడకు చెందిన ఫ్యామిలీ స్కూటీపై వెళుతుండగా ఫైర్ ఇంజన్ ఢీకొనింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.