నిర్మల్: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం, జాతీయ జెండా ఆవిష్కరించిన TFCC చైర్మన్ రాజయ్య
Nirmal, Nirmal | Sep 17, 2025 తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను పండుగలా ప్రజలు ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17న కేవలం ప్రభుత్వ కార్యాలయంలో జరుపుకునే కార్యక్రమం కాకుండా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి పండుగల జరుపుకునే రోజులు రావాలని అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలె