ఖడ్గవలస జంక్షన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఖడ్గవలస జంక్షన్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడు ఖడ్గవల వద్ద గల నారాయణ పెట్రోల్ బంకు యజమాని మరడాన ఆదినారాయణ గా స్థానికులు తెలిపారు. పెట్రోల్ బంక్ నుండి ఇంటికి వెళుతుండగా బస్సు ఢీకొనగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.