పులివెందుల: చిత్రావతి రిజర్వాయర్ నుంచి ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేసిన తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ చైర్మన్ జోగి రెడ్డి
Pulivendla, YSR | Oct 29, 2025 కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చిత్రావతి (పి బి సి) రిజర్వాయర్ నుండి గేట్లు ఎత్తి  నీటిని విడుదల చేసిన తుంగభద్ర హెచ్.ఎల్.సి చైర్మన్ మారెడ్డి జోగి రెడ్డి, మొంథా తుపాను కారణంగా మూడు వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో ముందు జాగ్రత్త చర్య గా ఒక గేటు ఎత్తి రెండు వేల క్యూసెక్కులను నీటిని దిగువకు విడుదల చేసారు. రిజర్వాయర్ లోకి యోగి  వేమన రిజర్వాయర్, ధర్మవరం చెరువు, గండ్లూరు చెరువు, నుండి నీటి ఇన్ ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చిత్రావతి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు..