జమ్మలమడుగు: మైలవరం : పోలీసు స్టేషన్లో దేవాలయ, మసీదు నిర్వాహకులతో రూరల్ సీఐ సమావేశం
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం మైలవరం పోలీసు స్టేషన్లో ఆదివారం మండలపరిధిలోని దేవాలయ, మసీదు నిర్వాహకులతో జమ్మలమడుగు రూరల్ సీఐ భాస్కర్ రెడ్డి సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా రూరల్ సీఐ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జాతరలు, వేడుకలలో పాల్గొనే భక్తుల భద్రత నేపథ్యంలో నిర్వహకులకు సూచనలిచ్చారు. కార్తీక పౌర్ణమి, సోమవారాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మతపరమైన ప్రదేశాల ప్రాంగణంలో తప్పనిసరిగా సీసీ కెమెరాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.