తాడిపత్రి: యాడికి లోని ఉన్నత పాఠశాల సమీపంలో రామిరెడ్డి అనే రైతుకు చెందిన గడ్డివాముకి నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు
యాడికిలోని ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న రామిరెడ్డి అనే రైతుకు చెందిన వరిగడ్డి వామికి బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. బాధిత రైతు రామిరెడ్డి స్థానికులతో కలిసి మంటలు ఆర్పడానికి ప్రయత్నించాడు. అయితే ప్రయోజనం లేకపోయింది. మంటల్లో వరిగడ్డి వామి కాలిపోయింది. ఈ ఘటనపై బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.