పీలేరు రెవెన్యూ డివిజన్ సాధన సమితికి సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి
పీలేరు మండలం పీలేరు పట్టణ కేంద్రంగా గత మూడు రోజులుగా పీలేరు రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ ఎన్.సుధాకర్ బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి సందర్శించి, సాధన సమితి నాయకులకు పూలమాలలు వేసి సంఘీభావం ప్రకటించారు. “పీలేరు ప్రాంతం భౌగోళికంగా, పరిపాలనా దృష్ట్యా రెవెన్యూ డివిజన్ స్థాయి గుర్తింపు పొందడానికి అన్ని అర్హతలు కలిగి ఉందని అన్నారు. ప్రజల న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకోవాలన్నారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకపోతే, వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటిస్తామన్నారు