వెంకటగిరిలో భ్రమరాంబ థియేటర్ వద్ద అపశృతి
తిరుపతి జిల్లా వెంకటగిరిలో 'OG' సినిమా ప్రదర్శిస్తున్న భ్రమరాంబ థియేటర్ వద్ద గత రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. అభిమానులు దాదాపు 30 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసి, ఆ కటౌట్ వెనుకవైపు ఫైరింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. ఆ ఫైరింగ్ నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడి పవన్ కటౌట్ కి వేసిన పూల దండకు అంటుకున్నాయి. ఈ ఘటనలో పవన్ కటౌట్ స్వల్పంగా దెబ్బతింది. అభిమానులు వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పింది..