మెదక్: చల్మెడ గ్రామంలో యూరియా కోసం బారులు రైతులు, టోకెన్ల ద్వారా ఒక రైతుకు ఒక బస్తా యూరియా పంపిణీ
Medak, Medak | Sep 22, 2025 నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. సోమవారం యూరియా లారీ వస్తుందని తెలుసుకున్న రైతులు టోకెన్ల కోసం వందలాది మంది రైతులు వరుసలో నిలబడ్డారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద అధికారులు టోకెన్లు పంపిణీ చేస్తుండడంతో ఉదయం నుంచే టోకెన్ల కోసం బారులు తీరారు.రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ చల్మెడ గ్రామంలో రామాయంపేట సొసైటీ నుండి 540 యూరియా బస్తాల లోడ్ రావడంతో రైతులు క్యూ లైన్ లో నిలబడి యూరియా బస్తాలను సేకరిస్తున్నారని, ప్రజలకు యూరియా విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోకెన్ ద్వారా ఇస్తున్నామన్నారు