అనంతపురము I టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Cr.No.358/2025 U/s 109 BNS హత్యయత్న కేసులో నిందితుడు ఆసం జనార్ధన రెడ్డి (43 సం.) ను సోమవారం రాత్రి 8 గంటల సమయంలో వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ పి.జగదిష్ ఆదేశాల మేరకు ...డీఎస్పీ V. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో, I టౌన్ సీఐ G. వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అందిన సమాచారం మేరకు స్థానిక తారకనాథ్ కొట్టాల సమీపంలో అరెస్టు చేశారు.ట్రాన్స్పోర్ట్ వ్యాపార లావాదేవీల విషయంలో బాధితుడు కుర్రం సుధాకర్ కు, నిందితుడికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయన్నారు.