బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ఈరోజు రాత్రి మరింత విరుచుకుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించినట్లుగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం తెలిపారు. ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించామని అధికారులను పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం చేసినట్లు కలెక్టర్ అన్నారు. రాత్రి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు ఘల్లులు ఇచ్చే అవకాశం ఉందని అంతేకాకుండా వర్షం మరింత ఉధృతంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్లుగా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాజబాబు ఆదేశించారు