ఎమ్మెల్యే కృషితో బుచ్చికి గ్రేడ్ - 2 మున్సిపాలిటీ హోదా : కమిషనర్ బాలకృష్ణ
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్ గ్రేడ్ అయిందని కమిషనర్ బాలకృష్ణ తెలిపారు. కేవలం అయిదేళ్ల వ్యవధిలో గ్రేడ్ - 2 మున్సిపాలిటీ హోదా దక్కడం సంతోషంగా ఉందన్నారు. గ్రేడ్-2 మున్సిపాలిటీలకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాల నుంచి నిధుల కేటాయింపు పెరుగుతుందని మంగళవారం రాత్రి 8 గంటలకు తెలిపారు