మచిలీపట్నం: పేదలకు పంపిణీ చేసే నివేశన స్థలాలపై మున్సిపల్ అధికారులతో సమీక్షించిన మంత్రి కొల్లు రవీంద్ర
పేదలకు పక్కా ఇంటి కల సాకారం చేసి తీరాల్సిందేని రాష్ట్ర గనులు, భూగర్భ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి 7గంటల సమయంలో మచిలీపట్నంలోని తన నివాసంలో మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులతో సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాల పేరుతో డ్రామాలు తప్ప ఎక్కడా, ఎవరికీ న్యాయం చేసింది లేదన్నారు. సెంటు పట్టాల పేరుతో భారీ స్కాములకు తెరలేపారన్నారు.