కుప్పం: కుప్పం ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ప్రారంభం
కుప్పం ఏరియా ఆసుపత్రిలో నూతన బ్లడ్ బ్యాంక్ను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ప్రారంభించారు. ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకును ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్ పేర్కొన్నారు. బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ రక్తదానం చేశారు.