పలమనేరు: పట్టణం మునినారాయణ శెట్టి వీరికి చెందిన శివశంకర్ రెడ్డి సునంద దంపతులు అల్లూరి సీతారామరాజు జిల్లాలో బస్సు ప్రమాదంలో మృతి చెందిన సంగతి విధితమే. శివశంకర్ రెడ్డి స్నేహితుల బృందం రూపేష్ తదితరులు తెలిపిన సమాచారం మేరకు. చిన్నప్పటినుండి కలిసి చదువుకున్నాము 1989 టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరూ నివాళులు అర్పించడం జరిగింది సునంద శివశంకర్ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరం. నేడు వారి ఇరువురి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది, వారి కుటుంబీకులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.