పూతలపట్టు: పూతలపట్టులో దానిమ్మ పండ్లతో వెళుతున్న ఐచర్ వాహనం బోల్తా
దానిమ్మకాయలతో వెళుతున్న అదుపుతప్పి ఐచర్ వాహనం బోల్తా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండలంలోని బెంగళూరు తిరుపతి రహదారి కొత్తకోట సమీపంలో ఐచర్ వాహనం మంగళవారం ఉదయం బోల్తా పడింది దీంతో డ్రైవర్ కు స్వల్ప గాయపడినట్లు స్థానికులు తెలిపారు దానిమ్మకాయల కోసం ప్రజలు ఎగబడ్డారు సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు గాయపడిన డ్రైవర్ని ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.